: తెలుగు రాష్ట్రాలకు 'ఆక్టోపస్' అండ!
ఇటీవలి కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలోని కీలక ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్న ఆక్టోపస్ బలగాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. ముఖ్యంగా, హైదరాబాదుతో పాటు తిరుపతి, విశాఖ, నెల్లూరు, విజయవాడ వంటి ముఖ్య నగరాలపై ఉగ్రదాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని భావిస్తున్నాయి. భద్రతే పరమావధిగా ఆక్టోపస్ బలగాలకు మరిన్ని సౌకర్యాలు, అధికారాలు ఇవ్వాలని కూడా తెలుగు ప్రభుత్వాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.