: ఆరెస్సెస్ ఉగ్రవాద సంస్థ కాదు... సిక్కుల పిటిషన్ ను తోసిపుచ్చిన అమెరికా


బీజేపీ సిద్ధాంతకర్త హోదాలో దేశం నలుదిశలా విస్తరించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలన్న పిటిషన్ ను అమెరికా తోసిపుచ్చింది. ఆరెస్సెస్ ఉగ్రవాద సంస్థ ఎంతమాత్రం కాబోదంటూ అమెరికా ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు దాఖలైన సిక్కు హక్కుల సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించాలని ఫెడరల్ కోర్టుకు సూచించింది. అసలు తమ పరిధిలో లేని ఆరెస్సెస్ ను తామెలా ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తామని కూడా ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థను అమెరికా ప్రభుత్వం నిలదీసింది.

  • Loading...

More Telugu News