: ఈ సినిమా చూసిన తొలి వ్యక్తిని నేనే!: నాని
ఈ సినిమా చూసిన తొలి వ్యక్తిని తానేనని హీరో నాని తెలిపాడు. 'ఓకే బంగారం' ఆడియో వేడుకలో పాల్గొన్న నాని మాట్లాడుతూ, సినిమాలో హీరో పాత్రకు తానే డబ్బింగ్ చెప్పానని అన్నాడు. ఇలాంటి సినిమాలో డబ్బింగ్ చెప్పడమేంటి? నటించి ఉండాల్సిందని చెప్పాడు. అయితే దేనికైనా తల రాత ఉండాలని, టైమ్ వచ్చినప్పుడు అంతా జరుగుతుందని నాని చెప్పాడు. సినిమా బాగుందని, నిత్యామీనన్, దుల్ఖర్ బాగా నటించారని నాని ప్రశంసించాడు. సినిమాకు డబ్బింగ్ కూడా బాగా వచ్చిందని అన్నాడు. సినిమా బాగుంటుందని, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నాని అభిప్రాయపడ్డాడు. మణిరత్నం, ఏఆర్ రెహమాన్, ప్రకాశ్ రాజ్, దిల్ రాజు వంటివారిని అభిమానిస్తానని నాని తెలిపాడు.