: లక్ష ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు: మంత్రి కడియం


ప్రభుత్వ ఉద్యోగా లకోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ఆశావహులకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు విడుదలచేయబోతోంది. విద్యాశాఖతో పాటు ఇతర విభాగాల్లో ఉన్న సుమారు లక్షకు పైగా ఖాళీల భర్తీకి 2015-16 ఏడాదిలో నొటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గలో పర్యటించిన కడియం నగర పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయబోయే ఎడ్యుకేషనల్ హబ్ కు సంబంధించిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గురుకుల విద్యా వ్యవస్థను పటిష్టం చేసి, మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు.

  • Loading...

More Telugu News