: 5 వేల ఏళ్ల క్రితం నాటి అస్థిపంజరాలు బయటపడ్డాయి


హర్యానాలోని హిస్సాల్ జిల్లా రాఖిగర్హీ గ్రామానికి సమీపంలో నాలుగు అస్థిపంజరాలు బయటపడ్డాయి. దక్షిణ కొరియా సియోల్ నేషనల్ యూనివర్సిటీ, దక్కన్ కళాశాల సంయుక్తంగా జరిపిన తవ్వకాల్లో సుమారు 5 వేల ఏళ్ల క్రితం నాటి నాలుగు అస్థిపంజరాలను గుర్తించినట్టు ఆచార్య నీలేశ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలుగు అస్థి పంజరాల్లో రెండు పురుషులవి కాగా, ఒకటి మహిళ, మరొకటి బాలుడి అస్థి పంజరమని చెప్పారు. పురుషులకు చెందిన అస్థిపంజరాలు ఒక్కోటి 5 అడుగుల ఆరు అంగుళాల పొడవు ఉండగా, మహిళ అస్థి పంజరం 5 అడుగుల నాలుగు అంగుళాలు ఉన్నట్టు వెల్లడించారు. బాలుడి వయసు 10 ఏళ్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, వీటిని డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపినట్టు ఆయన తెలిపారు. ఇవి హరప్పా కాలం నాటివని, వీటిని పరీక్షించాక మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News