: మరో 15 భాషల్లో యూట్యూబ్


మరో 15 మాతృభాషల్లో వీడియోలను అందించేందుకు 'వీడియో షేరింగ్' వెబ్ సైట్ యూట్యూబ్ ఏర్పాట్లు చేసింది. నావిగేషన్ కోసం మరో 15 భాషలు చేరడంతో ఇకపై మొత్తం 76 ప్రాంతీయ భాషల్లో యూట్యూబ్ ను వీక్షించవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో 95 శాతం మంది తమ మాతృభాషలో వీడియోలను చూడచ్చు. వీలైనంత ఎక్కువ మందికి వారివారి మాతృభాషల్లో యూట్యూబ్ ను వీక్షించే వెసులుబాటు కల్పించాలని యూట్యూబ్ భావిస్తోంది. ఇప్పటికే 165 భాషల్లో వీడియోలకు క్యాప్షన్ సదుపాయం ఉందని యూట్యూబ్ వెల్లడించింది. అజార్ బైజాన్, ఆర్మేనియన్, జార్జియన్, కజక్, ఖ్మేర్, కిర్ఘిజ్, లావో, మాసిడోనియన్, మంగోలియన్, మయన్మార్, నేపాలీ, పంజాబీ, సింహళ, అల్బేనియన్, ఉజ్బెక్ తదితర భాషలు యూట్యూబ్ లో కొత్తగా చేరాయి.

  • Loading...

More Telugu News