: సమాధానం దొరికింది... చెరిల్ పుట్టినరోజు ఎప్పుడో తెలిసింది!
సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ప్రశ్న 'చెరిల్ పుట్టినరోజు ఎప్పుడు?' అన్న ప్రశ్నకు సమాధానం దొరికిందా? దొరకకుంటే... ఇక చదవండి. ఈ ప్రశ్నకు సమాధానం ప్రశ్నలోనే లభిస్తుంది. ఆల్బర్ట్, బెర్నార్డ్ ల మాటలను బట్టి ఒక్కో తేదీని తొలగిస్తూ వెళితే జవాబు వస్తుంది. చెరిల్, ఆల్బర్ట్ కు నెలను, బెర్నార్డ్ కు తేదీని చెప్పింది కదా. "నాకు చెరిల్ పుట్టిన రోజు ఎప్పుడో తెలియదు. బెర్నార్డ్ కు కూడా తెలియదని మాత్రం నాకు తెలుసు" అని మొదట ఆల్బర్ట్ అన్నాడు కదా! చెరిల్ చెప్పిన 10 తేదీల్లో 18, 19 తేదీలు మాత్రమే ఒక్కసారి వచ్చాయి. ఈ రెండు తేదీల్లో ఆమె పుట్టిన రోజు ఉంటే, ఆల్బర్ట్ కు మే లేదా జూన్ చెప్పి ఉండాలి. అవి రెండూ చెప్పలేదు కాబట్టి అతనికి తెలీదు. అంటే ఆ రెండు తేదీలనూ తొలగించొచ్చు. ఇక మిగిలింది 5 తేదీలు. బెర్నార్డ్ కు తేదీ తెలుసు. తొలగించిన రెండు నెలలు తెలుసు. కాబట్టి ఈ రెండు అంశాలూ కామన్ గా ఉన్న జూలై 14, ఆగష్టు 14 కూడా తొలగిపోయినట్టే. చివరికి మిగిలింది జూలై 16, ఆగష్టు 15, ఆగష్టు 17. ఆల్బర్ట్ "ఆమె పుట్టిన రోజు ఎప్పుడో నాకు తెలుసు" అన్నాడంటే, అతనికి నెల తెలుసు కాబట్టి. ఇప్పటికే ఆగస్టు నెలలో చెరిల్ పుట్టిన రోజు లేదని తేలిపోయింది కాబట్టి ఇక మిగిలింది జూలై 16. ఆ వెంటనే బెర్నార్డ్ కు సైతం ఆమె పుట్టినరోజు ఎప్పుడో తెలిసిపోదా మరి! ఈ చిక్కు సమాధానం అర్థం కాకుంటే, అసలు ప్రశ్న ఏంటో తెలుసుకోండి. ఈ లింకును చూడండి. https://www.ap7am.com/flash-news-497286-telugu.html