: వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్
గతవారం వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ పై జరిగిన ఎన్ కౌంటర్ పై ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వికార్ తండ్రి మహ్మద్ అహ్మద్ ఈ పిటిషన్ ను దాఖలు చేశాడు. ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలని అందులో కోరాడు. ఇప్పటికే ఈ ఎన్ కౌంటర్ పై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టుకు తరలిస్తుండగా పోలీసులతో వికారుద్దీన్ ముఠా సభ్యులు ఐదుగురు గొడవపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. దాంతో వారంతా అక్కడిడక్కడే మరణించారు.