: డబ్బుల కోసం పెళ్లిళ్లు, శుభకార్యాల్లో డ్యాన్సులు చేశా... బాలీవుడ్ బాద్ షా షారుక్


బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డబ్బుల కోసం డ్యాన్సులు చేశాడట. అది కూడా తన కోసం కాదట, తన చిత్ర నిర్మాతల కోొసమట. ఆశ్చర్యంగా ఉన్నా, స్వయంగా అతడే ఈ విషయాన్ని వెల్లడించడంతో నమ్మక తప్పదు మరి. అభిమానుల సంఖ్యాపరంగానే కాక డబ్బు విషయంలోనూ షారుక్ ఖాన్ ప్రపంచంలోనే టాప్ టెన్ జాబితాలో ఉన్నాడు. రెండేళ్ల క్రితం ఏకంగా సదరు జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. సరిగ్గా అదే సమయంలో అతడి ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. తమ వద్ద డబ్బులు అయిపోయాయి, ఏం చేద్దామని నిర్మాతలు షారుక్ ను అడిగారట. దాందేముంది... పెళ్లిళ్లు, శుభకార్యాల్లో డ్యాన్సులు చేసి డబ్బు సంపాదిద్దాం లెండి అని షారుక్ చెప్పాడట. అనుకున్నట్లుగానే సదరు కార్యక్రమాల్లో అతడు స్టెప్పులేసి డబ్బు పోగు చేసి నిర్మాతలకు అందించాడు. ఆ చిత్రం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పూర్తైంది. అయితే నిర్మాతల నుంచి నుంచి సదరు ఫోన్ వచ్చిన సమయంలో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత ట్విట్టర్ చూస్తే, ప్రపంచంలోని ధనిక నటుల్లో అతడికి రెండో స్థానం దక్కిందని తెలిసిందట.

  • Loading...

More Telugu News