: గుంటూరు జిల్లాలో దారుణం... ఆరేళ్ల చిన్నారిని కరిచి చంపిన కుక్కలు


గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలు బలిగొంది. వీధి కుక్కలు ఒక ఇంటి చిరుదీపాన్ని అర్పివేశాయి. జిల్లా పరిధిలోని కాకుమానులోగల ముస్లిం కాలనీలో ఈ దారుణం జరిగింది. సుమారు 10 వీధి కుక్కలు ఒక్కసారిగా ఆరేళ్ల చిన్నారి షేకే కౌసరాపై దాడి చేయగా, ఆ పాప తల, పొట్టపై తీవ్ర గాయాలపాలై మరణించింది. ఈ ఘటనలో మరో బాలికకు కూడా గాయాలు అయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. అధికారులు మాత్రం ఇకపై ఎటువంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతామని, వీధి కుక్కలను నివారిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు.

  • Loading...

More Telugu News