: ‘శేషాచలం’ ఎన్ కౌంటర్ పోస్టుమార్టం, ఎఫ్ఐఆర్ లను సమర్పించండి: ఏపీకి హైకోర్టు ఆదేశం
శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించి హైకోర్టు విచారణ చేపట్టింది. నాటి ఘటనలో చనిపోయిన తమిళనాడు వాసి శశికుమార్ భార్య మునియమ్మాళ్ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన కూలీల మృతదేహాలకు నిర్వహించిన శవ పరీక్ష నివేదికలు, నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను తమకు అందజేయాలని కోర్టు ఏపీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలపడంతో, సదరు సిట్ లోని సభ్యుల వివరాలను కూడా అందజేయాలని కోర్టు కోరింది.