: కల్యాణ్ కు కోర్టు మొట్టికాయ... ‘మా’ రిజల్ట్స్ రిటర్నింగ్ అధికారి నిర్ణయమేనన్న కోర్టు


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాల వెల్లడిపై నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించింది. ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలన్న నటుడు కల్యాణ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి రిటర్నింగ్ అధికారి నిర్ణయం ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీంతో సుదీర్ఘ కాలం కొనసాగిన ఉత్కంఠకు కోర్టు కొద్దిసేపటి క్రితం తెర దించింది. ఇక ఎన్నికల ఫలితాల వెల్లడిని నిలుపుదల చేసేలా వ్యవహరించిన కల్యాణ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అకారణంగా ఎన్నికల ఫలితాలను నిలపుదల చేసేందుకు కారణమవ్వడమే కాక, కోర్టు సమయాన్ని వృధా చేశారని ఆక్షేపిస్తూ అతడికి రూ.10 వేల జరిమానా విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో త్వరలోనే మా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News