: ఆప్ మాజీ నేతల కొత్త పార్టీ 'స్వరాజ్ అభియాన్'
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవల గెంటివేయబడ్డ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు 'స్వరాజ్ అభియాన్' పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు. ఇకపై పార్టీలకు అతీతంగా పనిచేస్తామని, అందుకే స్వరాజ్ అభియాన్ అనే పేరును ఖరారు చేశామని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా, ప్రజలు, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తాము పోరాటం చేస్తామని, ప్రజల పక్షాన నిలుస్తామని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూనే 'స్వరాజ్ అభియాన్'కు మద్దతిస్తామని 75 శాతం మంది కార్యకర్తలు హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. మరో 25 శాతం మంది మీ వెన్నంటి నిలుస్తామని తెలిపారని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు.