: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటాం: వెంకయ్యనాయుడు


అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారు. తప్పకుండా రైతులను కేంద్రం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. అధైర్య పడవద్దని, త్వరలోనే కేంద్రంనుంచి పరిహారం అందుతుందని చెప్పారు. తెలంగాణలో పంట నష్టపోయిన పలు జిల్లాల్లో వెంకయ్య, బండారు దత్తాత్రేయ, మోహన్ బాయ్ కందారియా పర్యటించారు. ఈరోజు నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని రేవులపల్లి, శివారెడ్డిగూడెం గ్రామాల్లో పంటలను వారు పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చేతికొచ్చిన పంట వర్షాల కారణంగా పనికి రాకుండా పోయిందని మంత్రులతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News