: రన్ వే పై జారిన విమానం... 20 మందికి గాయాలు


ఆకాశయానంలోనే కాదు, రన్ వే పైనా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆకాశయానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఓ విమానం సురక్షితంగా కిందకు దిగిన తర్వాత ఎయిర్ పోర్టు రన్ వే పై సర్రున జారిపోయింది. జపాన్ లోని హిరోషిమాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి 74 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఏసియానా ఎయిర్ లైన్స్ విమానం హిరోషిమా ఎయిర్ పోర్టులో సురక్షితంగానే ల్యాండైంది. అయితే రన్ వే సరిగా లేకపోవడంతో దిగీ దిగగానే సర్రున జారిపోయింది. దీంతో ప్రయాణికులను ప్రధాన ద్వారం ద్వారా దించేందుకు వీలుకాక, అత్యవసర మార్గాల ద్వారా వారిని దింపాల్సి వచ్చింది. ఈ ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చిందని జపాన్ అధికార వార్తా సంస్థ ఎన్ హెచ్ కే వెల్లడించింది.

  • Loading...

More Telugu News