: అమెరికాలో దేవుడి డబ్బు నొక్కేసిన పూజారి... 27 ఏళ్ల జైలుశిక్ష
అమెరికాలోని జార్జియాలో ఒక దేవాలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న అన్నామలై అలియాస్ స్వామీజీ శ్రీ సెల్వం సిద్ధార్ (49)కు న్యూయార్క్ కోర్టు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దైవ కార్యాలకు వినియోగించాల్సిన ఆలయ ఆదాయాన్ని సొంతానికి వాడుకొని భారీగా అక్రమ ఆస్తులను సంపాదించాడన్నది ఇతనిపై ప్రధాన అభియోగం. దీంతో పాటు బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలు, పన్నుల చెల్లింపుల్లో మోసాలు కూడా చేశాడు. కొందరు భక్తులు అతనిపై ఫిర్యాదు చేయడంతో, విచారించిన కోర్టు జైలుశిక్షను ఖరారు చేసింది.