: జగన్ జిల్లాలోకి నారా లోకేశ్ యాత్ర... రైల్వే కోడూరులో ఘన స్వాగతం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కార్యకర్తల సంక్షేమ యాత్ర వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోకి ప్రవేశించింది. చిత్తూరు జిల్లాలో యాత్రను ముగించుకున్న లోకేశ్, కొద్దిసేపటి క్రితం కడప జిల్లా రైల్వే కోడూరు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. నిన్న రాత్రే స్వాగత ఏర్పాట్లను పూర్తి చేసిన టీడీపీ కార్యకర్తలు, నేటి తెల్లవారుజాము నుంచే లోకేశ్ రాక కోసం వేచి చూశారు. ఆయన యాత్ర పట్టణంలోకి చేరుకోగానే కార్యకర్తల నినాదాలు హోరెత్తాయి. కడప జిల్లాలో యాత్ర ముగించుకున్న తర్వాత లోకేశ్, కర్నూలు జిల్లాలోనూ యాత్రను కొనసాగించనున్నారు.