: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‘ఇండియన్స్’... మరికాసేపట్లో ‘రాయల్స్’తో ఢీ!


ఐపీఎల్-8 లో భాగంగా నేడు జరగనున్న లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తో ఢీకొనబోతోంది. అహ్మదాబాదులోని మోతెరా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్, ఈ మ్యాచ్ లోనూ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ సీజన్ లో ఇంకా బోణీ కొట్టని ముంబై ఇండియన్స్, ఈ మ్యాచ్ లోనైనా నెగ్గాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు.

  • Loading...

More Telugu News