: ఇక 'డ్రైవర్ బాలయ్య'... హిందూపురంలో ఆర్టీసీ బస్సును నడిపిన బాలకృష్ణ
టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డ్రైవర్ అవతారం ఎత్తారు. లారీ డ్రైవర్ సినిమాలో ఆయన ఎప్పుడో ఆ పాత్ర పోషించారులే అనకండి. ఎందుకంటే, ఈ సారి ఆయన డ్రైవర్ గా మారింది ఆర్టీసీ బస్సుకు. అసలు విషయమేంటంటే, ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం హిందూపురంలో బాలయ్య పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనకు వెళ్లిన బాలకృష్ణ అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. నేడు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఆయన హిందూపురం ఆర్టీసీ డిపోకు కొత్తగా అందిన ఓ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సుకు పచ్చజెండా ఊపడంతోనే సరిపెట్టని బాలయ్య, స్వయంగా బస్సు డ్రైవర్ సీటులో కూర్చుని, బస్సును కొంతదూరం నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.