: ఏకమైన రెండు రాష్ట్రాల లారీ ఓనర్లు... ఎంట్రీ ట్యాక్స్ పై గరికపాడు వద్ద మహాధర్నా


తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎంట్రీ ట్యాక్స్ పై ఏపీలోని లారీ ఓనర్లు చేపట్టిన మహా ధర్నాకు తెలంగాణకు చెందిన లారీ ఓనర్లు మద్దతు పలికారు. కృష్ణా జిల్లా పరిధిలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఏపీ లారీ ఓనర్లు కొద్దిసేపటి క్రితం మహా ధర్నా పేరిట నిరసనకు తెర తీశారు. నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న ఈ చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్న ఈ ధర్నాలో పాలుపంచుకునేందుకు తెలంగాణ లారీ ఓనర్లు కూడా బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ఇరు రాష్ట్రాలకు చెందిన లారీ ఓనర్లు మహా ధర్నాలో తెలంగాణ సర్కారుపై ఉమ్మడి పోరు సాగించనున్నారు. మహా ధర్నా నేపథ్యంలో విజయవాడ-హైదరాబాదు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఎంట్రీ ట్యాక్స్ పేరిట రెండు రాష్ట్రాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా లారీ ఓనర్లు ఆరోపించారు. ఇప్పటికైనా సీఎంలిద్దరూ కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News