: ఏపీలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంటుకి ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంటు నెలకొల్పడానికి అవగాహనా ఒప్పందం కుదిరింది. చైనాలోని న్యూ ఎరా సంస్థతో ఆంధ్రాకు చెందిన రెనెన్ సంస్థ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. అవగాహన పత్రాలపై రెనెన్ సంస్థ ఎండీ చింతకాయల విజయ్, చైనా సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు.