: గృహరుణాలపై వడ్డీరేటు తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్
హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బీఐ బ్యాంకుల తరువాత గృహరుణాలపై వడ్డీరేటును ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తగ్గించింది. పావు శాతం వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గించిన రేటు ఇప్పటికే ఋణం తీసుకున్న వారికి, కొత్త వినియోగదారులకు వర్తిస్తుందని తెలిపింది. ఈ క్రమంలో గృహరుణం కోసం దరఖాస్తుచేసే మహిళలకు ఇప్పుడు వడ్డీ రేటు శాతం 9.85 శాతం ఉంటుందని, ఇతరులకు 9.90 శాతం ఉంటుందని బ్యాంకు పేర్కొంది. తగ్గించిన రేటు ఈరోజు నుంచే అమల్లోకి రానుంది.