: నా వ్యాఖ్యల ఉద్దేశం అది కాదు...!: 'నలుగురు పిల్లల' కామెంట్లపై స్వామి గౌడ్ వివరణ!
తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నాలిక్కరుచుకున్నారు. ‘‘హిందువులు నలుగురు పిల్లలను కనడం ద్వారా ముస్లింలను డామినేట్ చేయొచ్చు’’ అని ఆయన ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో ఆయన ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చారు. అసలు తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదని ఆయన తెలిపారు. కన్నబిడ్డలున్నా వృద్ధులైన తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వృద్ధాశ్రమాలకు వెళుతున్నారని, ఈ విషయం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని అన్నారు. ఆ బాధతోనే సదరు వ్యాఖ్యలు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోరాదని ఆయన కోరారు.