: బెజవాడలో సందడి చేసిన బన్నీ
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు విజయవాడలో సందడి చేశాడు. జోయాలుక్కాస్ బంగారు ఆభరణాల దుకాణాన్ని అల్లు అర్జున్ సందర్శించాడు. ఈ సందర్భంగా జోయాలుక్కాస్ రూపొందించిన వజ్రాలు పొదిగిన గాజులను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా అల్లువారబ్బాయి మాట్లాడుతూ, తనకు స్టైల్ అంటే ఇష్టమని, జోయాలుక్కాస్ ఉత్పత్తులు స్టయిల్ గా ఉంటాయని పేర్కొన్నాడు. ఇక తన బాల్యంలో బెజవాడ వీధుల్లో తిరిగానని ఈ డాన్సింగ్ హీరో గుర్తు చేసుకున్నాడు. శనివారం పనిదినమైనా మండే ఎండలో తనను చూసేందుకు అభిమానులు రావడం పట్ల అల్లు అర్జున్ స్పందించాడు. ఇంతమందికి ఆరాధ్యుణ్ణవడం ఓ అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. ఇక తన కొత్త సినిమా 'ఇద్దరమ్మాయిలతో'.. వేసవిలో రానుందని వెల్లడించాడు.