: అసోం మహిళా ఎమ్మెల్యే అరెస్టు... కారు దొంగతో సంబంధాలున్నాయని ఆరోపణలు


అసోం కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే రుమి నాథ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కారు చోరీ కేసులో ఈ ఉదయం గౌహతిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముంబయి, ఢిల్లీల్లో దొంగతనం రాకెట్టు నడుపుతున్న అనిల్ చౌహాన్ తో ఎమ్మెల్యేకు సంబంధాలున్నాయన్న తీవ్ర ఆరోపణలతో ఆమెను అరెస్టు చేసినట్టు తెలిసింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న అతనికి అసోం అసెంబ్లీ ప్రాంగణంలో ప్రవేశించేందుకు సదరు ఎమ్మెల్యే కారు పాస్ లు ఏర్పాటు చేసినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ ఆమెకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. ఇప్పటికే అతడిని పోలీసులు అరెస్టుచేసి విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News