: 'ఐపీఎల్-8'లో హైదరాబాద్ బోణీ


ప్రస్తుత ఐపీఎల్-8 టోర్నీలో బలహీనమైన జట్లలో ఒకటిగా పేరున్న హైదరాబాద్ సన్‌ రైజర్స్‌ జట్టు చెలరేగింది. డేవిడ్ వార్నర్ 27 బంతుల్లో 57కు తోడు శిఖర్ ధావన్ 42 బంతుల్లో 50 (నాటౌట్), కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 44 (నాటౌట్) పరుగులతో రాణించడంతో అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విధించిన 167 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో అధిగమించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు జట్టులో కోహ్లీ 41, డివిలియర్స్ 46 పరుగులు చేసినప్పటికీ భారీ స్కోర్ సాధించడంలో ఆ జట్టు విఫలం అయింది. వార్నర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో విజయంతో హైదరాబాద్ జట్టు ఐపీఎల్-8 సీజన్లో బోణీ కొట్టింది.

  • Loading...

More Telugu News