: టీఆర్‌ఎస్ ప్లీనరీకి పోటీగా చంద్రబాబు సభ!
ఈనెల 23న మహబూబ్ నగర్ లో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ జరగనుంది. 24న టీఆర్‌ఎస్ ప్లీనరీ హైదరాబాదులో జరగనున్న నేపథ్యంలో అంతకు ఒక రోజు ముందు సభ ఏర్పాటు చేయడం ద్వారా కాస్తయినా పైచేయి చూపాలన్నది దేశం శ్రేణుల లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ యువనేత రేవంత్ రెడ్డి ఈ సభను విజయవంతం చేసే బాధ్యతలు చేపట్టినట్టు సమాచారం. కాగా, బాబు ఇప్పటికే వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో బహిరంగ సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే.