: రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేది లేదంటున్న ఏపీ డిప్యూటీ సీఎం కేఈ
విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు కానున్న విమానాశ్రయం కోసం చేపట్టనున్న భూ సేకరణఫై ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి విస్పష్ట ప్రకటన చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోబోమని ఆయన తేల్చిచెప్పారు. విజయనగరం జిల్లాలో నేడు పర్యటించిన సందర్భంగా కేఈ ఈ మేరకు ప్రకటించారు. భోగాపురం విమానాశ్రయం భూముల విషయంలో రైతుల ఆందోళనలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన ప్రకటించారు. రైతులకు మెరుగైన పరిహారం ఇచ్చిన తర్వాతే, రైతుల అనుమతితోనే భూసేకరణ చేస్తామని ఆయన వెల్లడించారు.