: రికార్డు సృష్టించిన గేల్... సన్ రైజర్స్ తో మ్యాచ్ లో 200 సిక్సర్ ను బాదిన హిట్టర్!
ఐపీఎల్-8 సీజన్ లో భాగంగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన లీగ్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాదుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించి టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని, రాయల్ ఛాలెంజర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానం పలికింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సిక్సర్ల హీరో క్రిస్ గేల్ బెంగళూరు ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. తొలి ఓవర్ మూడో బంతినే సిక్స్ గా మలిచిన గేల్, ఐపీఎల్ లో 200 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. తొలి ఓవర్ లో బెంగళూరు 11 పరుగులు సాధించగా, గేల్ 9 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు.