: ఇక ‘బీరు’ షాంపులు... పురుషుల కోసం వెనెసా కేర్ కొత్త యత్నం!


వాతావరణంలో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాల కారణంగా పురుషులు చిన్న వయసులోనే బట్టతలతో దర్శనమిస్తున్నారు. బట్టతలను తప్పించుకునేందుకు పురుష పుంగవులు చేయని యత్నాలు లేవు. అందుకేనేమో, ఇటీవల సౌందర్య సాధనాల బాట పడుతున్న పురుషుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పురుషుల ‘బట్టతల’ బాధను అర్ధం చేసుకున్న సౌందర్య సాధనాల తయారీ సంస్థ వెనెసా కేర్, సరికొత్త యత్నం చేసింది. ‘‘మేం తయారు చేసిన డెన్వర్ బీరు షాంపును వాడండి.. మీ జుట్టును కండీషనింగ్ చేయడమే కాక, దుష్పలితాలను కూడా దరిచేరనీయదు’’ అని ప్రచారం చేస్తోంది. ఈ షాంపు 200 ఎంఎల్ బాటిల్ ధర రూ.160లేనట. ఇక విడి అమ్మకాలనూ దృష్టిలో పెట్టుకున్న ఆ సంస్థ 7 ఎంఎల్ ప్యాకెట్లను రూ.5కే అందిస్తానని ప్రకటించింది.

  • Loading...

More Telugu News