: షారుక్ కు రూ.15 కోట్ల బ్రాండ్ ఆఫర్!


పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కు తాజాగా ఓ భారీ ఆఫర్ వచ్చింది. టాయిలెట్ ఉపకరణాలకు సంబంధించిన కొత్త బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించాలంటూ ఓ కంపెనీ అతడిని సంప్రదించింది. ఇందుకుగానూ రూ.15 కోట్లు ఆఫర్ చేశారు. అంతకుముందు మార్కెట్ స్టడీ చేసిన సదరు కంపెనీ తమ ఉత్పత్తికి ప్రచారకర్తగా కింగ్ ఖాన్ అయితేనే చక్కగా సరిపోతాడని తెలుసుకున్నారట. అంతేగాక ఈ నటుడికున్న మహిళా ఫాలోయింగ్ తమ ఉత్పత్తి ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా ఆయనను ఒప్పించేందుకు చూస్తున్నారని తెలిసింది. ఈ ఎండార్స్ మెంటు విషయంలో ఇంకా ఒప్పందం ఖరారు కాలేదని, ఓకే అయిన వెంటనే వాణిజ్య ప్రకటనను షారుక్ తో చిత్రీకరిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News