: మూడో ముష్కరుడు ఎక్కడున్నాడో తెలియదు: తెలంగాణ హోం మంత్రి నాయిని


నల్గొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్లో మూడో ముష్కరుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సచివాలయంలో కొద్దిసేపటి క్రితం ఆయన ‘పోలీస్ టైగర్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో ఉగ్రవాదుల కాల్పులు, జానకీపురం ఎన్ కౌంటర్లపై స్పందిస్తూ మూడో ఉగ్రవాది జాడ తెలియలేదని చెప్పారు. సదరు ముష్కరుడి కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు. వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై విచారణ కొనసాగుతోందని నాయిని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News