: వికార్ ఎన్ కౌంటర్ పై విచారణకు టీ సర్కారు ఆదేశం... సిట్ కు సందీప్ శాండిల్య నేతృత్వం


విచారణ ఖైదీగా ఉన్న ఉగ్రవాది వికారుద్దీన్ సహా అతడి నలుగురు సహచురుల ఎన్ కౌంటర్ కు సంబంధించి విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య నేతృత్వం వహించనున్నారు. సిట్ లో ఆయనతో పాటు మరో ఐపీఎస్ అధికారి, నలుగురు అధికారులను నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్-నల్గొండ జిల్లాల సరిహద్దులో జరిగిన ఈ ఎన్ కౌంటర్ పై పలు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. నిరాయుధులైన వికారుద్దీన్ గ్యాంగ్ ను పోలీసులు అకారణంగా కాల్చి చంపారని ఆరోపిస్తూ విచారణకు డిమాండ్ చేశాయి. అన్ని వైపుల విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News