: ప్రత్యేక కోర్టు తీర్పును కొట్టేయండి: నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ‘రాజు’ల పిటిషన్
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఏడేళ్ల శిక్ష పడ్డ ఆ సంస్థ మాజీ చైర్మన్ బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు శిక్ష నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం వారిద్దరూ నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మోపిన అభియోగాలను నిర్థారిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని ఆ పిటిషన్ లో వారు కోర్టును అభ్యర్థించారు. దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన సత్యం కేసులో లేని లాభాలను చూపి రామలింగరాజు మదుపరులను నట్టేట ముంచారని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసులో దోషులుగా తేలిన మరో ఎనిమిది మందితో కలిసి రాజు సోదరులు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.