: చెన్నైలో మరో హెరిటేజ్ స్టోర్ పై బాంబుదాడి... నలుగురి అరెస్ట్!
శేషాచలం ఎర్రచందనం దొంగల ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ తమిళనాడులోని ఆంధ్రా సంస్థలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం చెన్నైలోని హెరిటేజ్ దుకాణంపై కొందరు నిరసనకారులు గుంపుగా వచ్చి నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు వివరించారు. బాంబుదాడికి బాధ్యులని భావిస్తున్న తమిళ అనుకూల సంఘానికి చెందిన నలుగురిని ఆరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆంధ్రా డిపోలకు చెందిన బస్సులు తమిళనాడు ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, తమిళ ప్రభుత్వ అధికారులు అక్కడి నుంచి అదనపు బస్సులను తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలకు తిప్పుతున్నారు.