: ఆదర్శ్ స్కాం కేసులో సుప్రీంను ఆశ్రయించిన అశోక్ చవాన్
ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో బాంబే హైకోర్టు తనపై ఇచ్చిన ఆదేశాన్ని పిటిషన్ రూపంలో సవాల్ చేశారు. వెంటనే స్వీకరించిన కోర్టు ఈ నెల 24న విచారణ చేయనుంది. దానికంటే ముందు ఈ కేసులో ట్రయల్ కోర్టులో వాయిదా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ కేసులో తన పేరును తొలగించాలంటూ మార్చిలో చవాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, జస్టిస్ ఎంఎల్ తహిల్యానీ దీనిని తిరస్కరించారు.