: పుష్కరాల సందర్భంగా అర్చకులకు పారితోషికం పెంపు


పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఆలయాల అర్చకులకు ఏపీ ప్రభుత్వం అదనపు పారితోషికం ఇవ్వనుంది. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పుష్కరాల సమయంలో ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉండటం, అంతేగాక ఈ కాలంలో వివాహాలు కూడా ఉండవు కాబట్టి తమకు అదనపు పారితోషికం ఇవ్వాలని దేవాదాయ శాఖను అర్చకులు ఇటీవల కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆ శాఖ పారితోషికం పెంపుకు ఆమోదం తెలిపింది. కాగా జులై 14 నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్న సంగతి విదితమే.

  • Loading...

More Telugu News