: నా కోరిక నెరవేరింది: సానియా మీర్జా


మహిళల డబుల్స్ లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన నేపథ్యంలో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అందరికీ కృతజ్ఞతలు చెబుతోంది. దాంతో తన చిరకాల కోరిక నెరవేరిందని తెలిపింది. తనను ఆశీర్వదించిన భగవంతునికి, అందరికీ ధన్యవాదాలు చెప్పింది. తనపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులు, తన కోచ్ కు కృతజ్ఞతలు తెలిపింది. దేశంలోని యువత తమపై తాము నమ్మకంతో ముందుకెళ్లాలని సానియా సూచించింది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సానియాకు అభినందనలు తెలిపారు. దేశంలో యువతకు ఆమె స్పూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News