: ఫేస్ బుక్ తో బెడిసి కొడుతున్న బంధాలు!
గోపాల్, కిరణ్... ఫేస్ బుక్ ఇద్దరినీ కలిపింది. గోపాల్ ఒక ఫొటో పోస్ట్ చేయగా, కిరణ్ దాన్ని లైక్ చేయలేదు. అంతే, మిత్రభేదం మొదలు. కిరణ్ ను కలిసిన గోపాల్, లైక్ ఎందుకు కొట్టలేదని అడిగి చితకబాదాడు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది. ఇంకో సంఘటనలో అమ్మాయి ఫొటో వాట్స్ యాప్ లో అప్‌లోడ్ చేయనందుకు గ్రూప్ అడ్మిన్ పై దాడి చేశాడో తుంటరి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు రోజురోజుకూ పెరుగుతూ స్నేహ సంబంధాలు బెడిసి కొడుతున్నాయని ఓ టెక్నాలజీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వే వివరాల ప్రకారం, ఫేస్ బుక్ లో తాము పోస్ట్ చేసిన ఫొటోలకు వచ్చిన లైకులను లెక్కకట్టి గొప్పలు చెప్పుకుంటున్న వారు 72 శాతం మంది ఉన్నారట. సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది తమ పోస్ట్‌లకు అత్యధికంగా లైకులు రావాలని కోరుకోగా, ఆశించిన మేరకు లైకులు రాకపోతే, ఏదో కోల్పోయామన్న భావన కలుగుతోందని 58 శాతం మంది తెలిపారు. 64 శాతం మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ఇంటర్నెట్ చర్యలను కనిపెడుతుండగా, వారికి తెలియకుండా, 68 శాతం మంది నెట్ లో చక్కర్లు కొడుతున్నారట.