: సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల... 27 నుంచి ఇంటర్వ్యూలు!
అత్యున్నతమైన పౌర సేవా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉద్యోగాల కోసం పరీక్ష రాసి నెలల తరబడి ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2014 ఫలితాలు వెల్లడయ్యాయి. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను యూపీఎస్సీ వెబ్ సైట్ www.upsc.gov.in లో ఉంచినట్టు కేంద్రం తెలిపింది. విజయం సాధించిన అభ్యర్థులకు ఈనెల 27 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఉద్యోగాల భర్తీలో జాట్ లకు రిజర్వేషన్ కల్పించే అంశంపై కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే.