: చల్లారని తమిళ కోపం... మధ్యవర్తిత్వం చేయనున్న రోశయ్య!


చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో జరిగిన ఎర్రచందనం దొంగల ఎన్ కౌంటర్ ఘటనపై తమిళనాట రోజురోజుకూ పరిస్థితులు విషమిస్తున్నాయి. నిత్యమూ ఎక్కడో ఒకచోట నిరసనలు, ఆంధ్రా ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. వీటిని ఎలా ఆపాలో తెలియక తమిళ ప్రభుత్వం చేతులెత్తేయగా, గవర్నర్ రోశయ్య మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన నేతృత్వంలో ఆంధ్రా, తమిళ ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇప్పటికే రోశయ్య సూచించారు. కాగా, వరుసగా ఎనిమిదో రోజు కూడా ఆంధ్రపదేశ్ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ఆర్టీసీ నిలిపేసింది. కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

  • Loading...

More Telugu News