: అలరించిన విజయవాడ 'అందాలు'!


అందమైన భామలు, లేత మెరుపు తీగలు... ఒకరు పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటే, మరొకరు ఆధునిక పోకడలను గుర్తుకు తెచ్చే దుస్తులు, ఇంకొకరు నిత్య నూతనత్వాన్ని చూపేలా అదరహో అనిపించే డిజైనర్ వేర్... ఇలా అతివలు ర్యాంపుపై హొయలు పోతుంటే ఆహూతులు వారిని చూస్తూ మైమరచిపోయారు. ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో 'మిస్-విజయవాడ' పోటీలు జరుగగా, వీటిల్లో శ్రీసత్య విజేతగా నిలిచారు. ద్వితీయ స్థానంలో సౌజన్య, తృతీయ స్థానంలో ప్రియాంకా చౌదరి నిలిచారు. అమ్మ, నాన్న, దేశం... ఎవరు కావాలో నిర్ణయించుకోవాలని న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నకు, తల్లిదండ్రులను అందించిన దేశమే కావాలని చెప్పి వీరు విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర, సినీ నటి పూనమ్‌ కౌర్, నటుడు అలీ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 227 మంది యువతుల్లో 18 మంది ఫైనల్స్‌ కు ఎంపిక కాగా, దేహ సౌందర్యం, మాట్లాడే తీరు, మేధస్సు తదితర అంశాల ప్రాతిపదికన విజేతలను ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News