: చంద్రబాబు, వెంకయ్యనాయుడులపై విచారణ చేయాలి: వీహెచ్


సత్యం రామలింగరాజు చీటింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా విచారించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సత్యం రామలింగరాజు ఎదిగిందే ఎన్డీయే హయాంలో అని ఆయన గుర్తు చేశారు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే బీజేపీ చేతులు ముడుచుకుని కూర్చుందా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News