: రాజస్థాన్ రోమాంచిత విజయం...డీడీని వెక్కిరించిన విధి


రాజస్థాన్ రాయల్స్ జట్టు రోమాంచిత విజయం సాధించింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్ లో డేర్ డెవిల్స్ ను మరోసారి విధి వెక్కిరించింది. 185 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ కు అజింక్యా రహానే (47), సంజు శాంసన్ (11) శుభారంభం అందించారు. హుడా (54) అద్భుతమైన ఇన్నింగ్స్ కు ఫల్క్ నర్ (17), మోరిస్ (13), సౌతీ (7) మెరుపులు తోడవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో తాహిర్ (4), మిశ్రా(2), మాథ్యూస్ (1) కీలక సమయాల్లో వికెట్లు తీసినప్పటికీ, చివరి బంతికి ఫలితం తారుమారవడం విశేషం. తాజా విజయంతో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

  • Loading...

More Telugu News