: నల్లజాతీయుడ్ని కాల్చిన తెల్లపోలీస్ కు జీవిత ఖైదు?
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడని నిరాయుధుడైన నల్లజాతీయుడ్ని కాల్చి చంపిన తెల్లపోలీసు అధికారిని విధుల నుంచి తప్పించారు. అమెరికాలోని దక్షిణ కరొలినా రాష్ట్రంలోని నార్త్ చార్టెస్టన్ నగరంలో ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘించి, ఘర్షణ పడి పారిపోతున్న వాల్టర్ స్కాట్ ను మైఖేల్ స్టేటర్ అనే పోలీసు వెనుక నుంచి ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపి అతనిని నేలకూల్చాడు. వీటిని స్థానికులు వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో, నల్లజాతీయులపై పోలీసుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని ఆరోపిస్తూ నల్లజాతీయులు ఆందోళనలు నిర్వహించారు. దీంతో తెల్లపోలీస్ అధికారిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల వీడియో ఆధారంగా అతనికి జీవిత ఖైదు, లేదా మరణి శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.