: ఓటమి కసితో గెలుపు కోసం...!


ఐపీఎల్ పోటీల్లో భాగంగా నేటి రాత్రి 8 గంటలకు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ రెండు జట్లూ తమ తొలి మ్యాచ్ లలో ప్రత్యర్థి జట్ల చేతుల్లో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. గత సంవత్సరపు విజేతల హోదాలో ముంబై ఇండియన్స్, రన్నరప్స్ హోదాతో రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఓటమి భారాన్ని ఏ జట్టు ముందు అధిగమిస్తుందోనని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుండడంతో సహజంగానే ముంబై జట్టుకు ప్రేక్షకుల మద్దతు అధికంగా ఉండనుంది. ఈ మ్యాచ్ అభిమానులకు మరో రసవత్తర పోరును చూపుతుందని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News