: ఓ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది: ఒబామా
క్యూబాతో సంవత్సరాలుగా సాగిన ప్రచ్ఛన్న యుద్ధం ఇక ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. క్యూబా నేత రవుల్ క్యాస్ట్రోతో సమావేశం అనంతరం ఒబామా మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఎలాంటి వైరం లేదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగించే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. క్యాస్ట్రోతో అర్థవంతమైన చర్చలు జరిగాయని తెలిపారు. క్యూబాను ఒక సమస్యగా తాము చూడబోవటం లేదని వివరించారు. క్యూబాకు ఎటువంటి హోదా ఇవ్వాలన్న విషయంలో సమీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. కాగా, 1982లో క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే దేశాల జాబితాలో అమెరికా చేర్చిన సంగతి తెలిసిందే.