: '100' కొడితే పావుగంటలో వస్తారు!
నేరాలు జరిగినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు సహాయం కావాలని అనుకుంటే ముందు గుర్తొచ్చేది పోలీసు శాఖ నిర్వహించే '100'. ఇకపై 'డయల్ 100' అత్యాధునిక సమాచార సాంకేతికతను సంతరించుకోనుంది. ఫోన్ చేసిన తరువాత గరిష్టంగా 15 నిమిషాల లోపు పోలీసు వాహనాలు సంఘటనా స్థలానికి చేరేలా ప్రణాళికలు రూపొందించారు. ఫోన్ కాల్ చేసిన ప్రదేశం ఆధారంగా అక్కడికి చేరేలా వాహనానికి జీపీఎస్ వ్యవస్థను అమర్చుతారు. దీంతో వాహన ప్రయాణాన్ని కూడా కంట్రోల్ రూం నుంచి పరిశీలిస్తూ, అవసరమైతే సూచనలు ఇవ్వచ్చు. ఈ ప్రాజెక్టు కోసం సాంకేతిక బిడ్లను ఆహ్వానించగా, ఇంటర్నేషనల్ కంపెనీలు ఆసక్తి చూపాయి.