: రాహుల్ కలల ప్రాజెక్టుకు ఎన్డీఏ మోకాలడ్డు!


కాంగ్రెస్ ఆశాదీపం రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథీలో 2013లో శంకుస్థాపన చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను మోదీ సర్కారు రద్దు చేసింది. జగదీశ్‌ పూర్‌ లో ఆదిత్య బిర్లా గ్రూపు సహకారంతో మెగా ఫుడ్ పార్కుకు రాహుల్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. నిబంధనల మేరకు భూసేకరణను పూర్తిచేయలేకపోయినందుకే కాంట్రాక్టును రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ ఫుడ్ పార్కును బిర్లా గ్రూపు అనుబంధ సంస్థ శక్తిమాన్ ఫుడ్‌ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టి, అనుకున్న సమయంలోగా ముందడుగు వేయలేకపోయింది. ఈ పార్క్ లోని పవర్ ప్లాంట్ కు గ్యాస్ ను సరఫరా చేయకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందన్నది శక్తిమాన్ అభిప్రాయం. సబ్సిడీపై గ్యాస్ అందించాలన్న నిబంధనలు లేవని ఫుడ్‌ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News