: లక్ష్మిని బాగా చదువుకున్న గృహిణిగా చూడాలనుకున్నా: మోహన్ బాబు
దొంగాట సినిమా గురించి తనకేమీ తెలియదని నటుడు మోహన్ బాబు తెలిపారు. ఈ 'దొంగాట' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినీ నిర్మాణంలో డబ్బు పెడుతున్నాం, వస్తుందో రాదో తెలియదని అన్నారు. సినిమా తప్ప ఇంకో రంగం తెలియదని మోహన్ బాబు చెప్పారు. సినీ రంగంలో గతంలో ఉన్న గౌరవ మర్యాదలు లేవని అన్నారు. నటుడు రోజువారీ కూలీ తీసుకుంటున్నాడని, నిర్మాతకు గౌరవం పోయిందని తెలిపారు. రెమ్యూనరేషన్ తీసుకుంటున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా, తీసుకునేది రోజు కూలీ అని చెప్పారు. రామారావు, నాగేశ్వరరావు, దాసరి నుంచి తాము క్రమశిక్షణ నేర్చుకున్నామని, ఇప్పుడా క్రమశిక్షణ పోయిందని తెలిపారు. లక్ష్మికి బాగా చదువుకుని గృహిణిగా ఉండమని చెప్పానని, అయితే తను బాగా చదువుకుందని, సినీ రంగానికి వచ్చిందని మోహన్ బాబు వెల్లడించారు. మంచి సినిమాలు చెయ్యమని కుమార్తెకు సూచించిన మోహన్ బాబు, నిర్మాతగా ఆమెను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. బాలసుబ్రమణ్యం, జేసుదాస్ లను లక్ష్మిని సింగర్ ని చేయమని అడిగితే అంతా నవ్వేశారని మోహన్ బాబు చెప్పారు. విధి ప్రకారం, కుటుంబానికి లక్ష్మి పేరుతెచ్చిందని మోహన్ బాబు చెప్పాడు.